- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope:ఆ రాశి వారికి వారికి అద్భుత సమయం.. మిగతా రాశుల పరిస్థితి ఎలా ఉందంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతోంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి వారు చేపట్టిన పనులలో కొంత శ్రమ, వ్యయప్రయాసలు ఉంటాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది, లేదంటే మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
వృషభ రాశి
ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కుటుంబంలో లేదా వృత్తిలో శుభవార్తలు వింటారు. తలపెట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కావడంతో పాటు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వాహన యోగం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈరోజు వీరికి అద్భుతంగా ఉండబోతుంది.
మిథున రాశి
ఈ రాశి వారు ఇవాళ కీలక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. అవాంతరాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. పని ఒత్తిడి వల్ల శ్రమాధిక్యం, స్వల్ప అనారోగ్యం కలగవచ్చు. బంధుమిత్రులతో తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇష్టదేవతా ప్రార్థన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం లేదా ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది.
సింహ రాశి
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి, ఆశించినంత వేగంగా ముందుకు కదలదు. ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో పనిభారం మరియు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి మరికొంత సమయం పడుతుంది.
కన్య రాశి
ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడమే కాకుండా, అనుకోని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తులు లేదా బంగారు ఆభరణాలపై పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం.
తుల రాశి
ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం. విలాస వస్తువుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. స్నేహితుల నుండి ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి స్వల్ప లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, కానీ వృత్తి, వ్యాపారాల పరంగా శ్రమ పెరుగుతుంది. రావాల్సిన బాకీలు ఉన్నప్పటికీ, అవి సకాలంలో చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది. ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు సర్దుకుంటాయి.
ధనుస్సు రాశి
ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు కొన్ని పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మకర రాశి
ఈరోజు మనస్సు కొంత చంచలంగా ఉంటుంది. గృహంలో కొన్ని మార్పులు చేయాలని కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణాల వల్ల నిరుత్సాహం చెందే అవకాశం ఉంది. కుటుంబంలో లేదా తోటివారితో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ప్రయత్న కార్యాలు ఫలించినప్పటికీ, కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కుంభ రాశి
ఈ రాశి వారు ఇవాళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల విషయంలో ఎక్కువ పట్టుదలకు పోవద్దు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈరోజు కొత్త పనులేవీ ప్రారంభించకుండా, రోజువారీ పనులపై దృష్టి పెట్టడం మంచిది.
మీన రాశి
సమాజంలో అపకీర్తి రాకుండా మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. అనవసర కలహాలు, వాదనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. దూర ప్రాంత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.






