- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ ఇంటి నుండే జనగణన.. స్వీయ గణన నమోదు చేసుకునే విధానం!
డిజిటల్ జనగణన 2026లో భాగంగా 'సెల్ఫ్-ఎన్యూమరేషన్' ప్రక్రియ ప్రారంభమైంది. మీ ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'స్వీయ గణన' (Self-Enumeration) ప్రక్రియ నేడు (ఏప్రిల్ 26, 2026) ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుంది. పౌరులు ఎక్కడి నుంచైనా సుమారు 15-20 నిమిషాల్లో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ తో పాటు యాప్‌ను తీసుకొచ్చింది.
నమోదు ప్రక్రియ - స్టెప్ బై స్టెప్ గైడ్..
1. 'స్వీయ గణన' (Self-Enumeration)కొరకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ se.census.gov.in ఓపెన్ చేయండి.
2. మీ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఎంచుకుని, క్యాప్చా ఎంటర్ చేసి 'Verify & Proceed' బటన్ నొక్కండి.
3. కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
4. మీకు అనుకూలమైన భాషను (తెలుగు/ఇంగ్లీష్/హిందీ) ఎంచుకోండి.
5. పోర్టల్‌లోని మ్యాప్ సహాయంతో మీ ఇంటి ఖచ్చితమైన స్థానాన్ని (Location) మార్క్ చేయండి. జిల్లా, మండలం, వార్డు, పిన్ కోడ్ వివరాలను ధృవీకరించండి.
6. ఇందులో ఇల్లు, వసతులు, ఆస్తులకు సంబంధించిన 27-33 ప్రశ్నలు ఉంటాయి.
7. ఇంటి గోడలు, పైకప్పు దేనితో నిర్మించారు?
8. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత?
9. తాగునీరు, విద్యుత్, వంట గ్యాస్, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉన్నాయా?
10. టీవీ, ఫ్రిజ్, ఇంటర్నెట్, వాహనాల వంటి ఆస్తుల వివరాలు.
11 పైన ఇచ్చిన అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్ నొక్కండి.
12. సబ్మిట్ చేసిన వెంటనే మీకు 11 అంకెల సెల్ఫ్-ఎన్యూమరేషన్ ఐడి (SE-ID) వస్తుంది. దీనిని స్క్రీన్‌షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. ఇది మీ మొబైల్ నంబర్‌కు కూడా ఎస్ఎంఎస్ వస్తుంది.
స్వీయ గణనలో ముఖ్యమైన గమనికలు
మే 11 నుంచి జూన్ 9 మధ్య ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు, కేవలం ఈ SE-ID ని వారికి చూపిస్తే సరిపోతుంది. వారు మళ్లీ ప్రశ్నలు అడగకుండా మీ డేటాను ధృవీకరించి ప్రక్రియను పూర్తి చేస్తారు. మీరు ఇచ్చే సమాచారం 'జనగణన చట్టం 1948' ప్రకారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1855 కు కాల్ చేయవచ్చు. డిజిటల్ పద్ధతిలో మీ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, దేశ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వాములు కావొచ్చు.






