ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ.. ఆ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాం

by Mallepaka Hamsa |

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shanti).

ఇది అందరికీ కనెక్ట్ అయ్యే కథ.. ఆ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాం
X

దిశ, సినిమా: మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shanti). ఇందులో ఈషా రెబ్బా (Eesha Rebba)హీరోయిన్‌గా నటిస్తుండగా.. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎఆర్ సజీవ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘ఇది యూనివర్సల్‌గా.. గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో కథను ఎక్కువగా కొత్తగా మలిచామని అన్నారు. తరుణ్ భాస్కర్ గోదావరి యాస కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారని, మ్యూజిక్ పూర్తిగా కొత్తగా ఉండగా.. మొత్తం ఏడు పాటలు ఉన్నాయని చెప్పారు.

ఫన్, డ్రామా, ఎమోషన్‌తో కూడిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఒక దర్శకుడిగా నాకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. చివరి 30 నిమిషాలు కొత్త కథలాగే అనిపిస్తుంది. తరుణ్ గారి క్యారెక్టర్ చేపల వ్యాపారం చేసే వ్యక్తి. ఒక చేప జీవితాన్ని మెటఫర్ గా తీసుకుని ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది. చేపకి మనం ఫుడ్ వేసినప్పుడు అది పొడుచుకునే తింటుంది. తరుణ్ క్యారెక్టర్ ఆ ఊర్లో తన తండ్రి మామయ్యను చూస్తూ పెరిగిన క్యారెక్టర్. ఆ ఊరు తప్పితే అక్కడ మరో ప్రపంచం తెలియదు. అలాగే శాంతి పాత్రని క్యాషియో(జీడి)ని మెటాఫర్ గా తీసుకోవడం జరిగింది. మనం క్యాషియో నట్‌ని తీసుకొని ఆ పండుని బయట పారేస్తాం. నిజానికి అది హెల్త్ కు చాలా మంచిది. అమ్మాయి ప్రాముఖ్యతని తెలిజేసేలా ఆ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది’’ అని చెప్పారు.

Next Story