బార్ టెండర్స్‌గా రాణిస్తున్న మహిళలు

by Chukka Sudharani |

దిశ, ఫీచర్స్ : హాస్పిటాలిటీ రంగాన అత్యంత ఆకట్టుకునే కెరియర్స్‌లో ‘బార్ టెండింగ్’ ఒకటి.

బార్ టెండర్స్‌గా రాణిస్తున్న మహిళలు
X

దిశ, ఫీచర్స్ : హాస్పిటాలిటీ రంగాన అత్యంత ఆకట్టుకునే కెరియర్స్‌లో 'బార్ టెండింగ్' ఒకటి. నిజానికి భారతీయ సమాజంలో ఈ పనిపట్ల చిన్నచూపు ఉన్నందున B-గ్రేడ్ వృత్తిగా పరిగణిస్తూ వచ్చారు. కానీ నేటి తరం మాత్రం ఆయా అపోహలు తొలగిస్తూ ఇటువైపు కూడా అవకాశాలున్నాయని యువతరానికి మార్గదర్శకత్వం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజెస్ సైతం 'ఫుడ్ అండ్ బేవరేజ్' టాపిక్‌లో భాగంగా బార్‌ టెండింగ్‌ బోధిస్తున్నాయి. F&B పరిశ్రమ వృద్ధితో పాటు రెస్టారెంట్లు, పబ్‌లు, బార్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తరుణంలో అవకాశాలకు కొరత ఉండదనేది స్పష్టం. ఇక కాలానుగుణంగా మహిళలు కూడా బార్‌టెండర్స్‌గా రాణిస్తున్నారు. కాగా దశాబ్దకాలం ఇదే కెరియర్‌లో కొనసాగిన ఫే ఆంటోయిన్ బారెట్టో.. ఔత్సాహిక మహిళలు, క్వీర్ కమ్యూనిటీకి 'మిస్టర్ బార్‌టెండర్ & ది క్రూ' ద్వారా ఈ ప్రొఫెషన్‌లో ట్రైనింగ్ అందిస్తున్నాడు. ఆ విశేషాలు..

'బార్‌టెండర్ జీవితమంతా మద్యం చుట్టే తిరుగుతుందని ప్రజలు భావిస్తారు. కానీ వాస్తవంగా ప్రజల చుట్టూ తిరుగుతుంది' అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక బార్‌టెండింగ్ కెరియర్ విషయానికొస్తే.. బార్‌లో మాక్‌టెయిల్స్, కాక్‌టెయిల్స్ సహా హార్డ్ డ్రింక్స్‌ను రూపొందించి, అందజేసే ప్రొఫెషనల్ జాబ్. పబ్/బార్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఏ వ్యక్తి అయినా మొదటగా సంభాషించేది బార్‌టెండర్‌తోనే. పైగా తప్పక ప్రయత్నించాల్సిన కాక్‌టెయిల్స్ లేదా బేవరేజెస్ రకాల గురించి వివరించేంది అతడే. ఈ మేరకు ఇండియాలోని బార్‌టెండర్లు ప్రపంచవ్యాప్త బార్‌టెండర్లతో సమానంగా ఉన్నారనేది ఎక్స్‌పర్ట్స్ మాట. ఈ ఏడాది ఆసియాలోని 50 బెస్ట్ షార్ట్‌లిస్టెడ్ బార్స్‌లో మొదటిసారిగా భారత్‌ నుంచి ఎనిమిది బార్స్ చోటు దక్కించుకోవడం విశేషం. నిజానికి ఈ ఇండస్ట్రీలో పురుషులే ఎక్కువగా ఉంటారన్నది వాస్తవమే. ఈ క్రమంలో బార్‌టెండింగ్‌లోనూ లింగ సమానత్వం తీసుకురావడం ద్వారా పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేందుకు బారెట్టో ప్రయత్నిస్తున్నాడు.

ట్రైనింగ్ :

బారెట్టో నిర్వహిస్తున్న 'మిస్టర్ బార్‌టెండర్ & ది క్రూ'.. బార్‌టెండింగ్ కళలో మహిళలు, ఎల్‌జీబీటీక్యూ+ వ్యక్తులకు పాన్ ఇండియా స్థాయిలో శిక్షణనిస్తోంది. మానవ అక్రమ రవాణా బాధితులు, ట్రాన్స్‌జెండర్ల కోసం బారెట్టో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు. పనిలో సురక్షితంగా ఉండేలా వారికి సాయపడేందుకు క్వీర్ పర్సన్స్‌కు సెన్సిటైజేషన్ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. థియరితో పాటు ముంబై, గోవాలోని బార్లలో ప్రాక్టికల్ లెస్సన్స్ జరుగుతాయి. పరిశ్రమలోని నిపుణులతో గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయి. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన మొదటి వ్యక్తుల్లో ఒకరైన సుమన్ సుబ్రమణి.. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తోంది. ప్రస్తుతం తను సొంతంగా బార్ పెట్టుకునేందుకు ప్లాన్స్ చేస్తోందని బారెట్టో తెలిపాడు. అదే విధంగా ముంబై వీధి వ్యాపారులైన లక్ష్మి, సోనియా కూడా మిక్సాలజీ క్రాఫ్ట్‌లో అద్భుతంగా రాణిస్తున్నట్లు తెలిపాడు.

పురుషాధిపత్యమున్న ఈ బ్లూ కాలర్ పరిశ్రమలో మహిళలు సహా క్వీర్ కమ్యూనిటీకి అవకాశం కల్పించాలన్న ఆలోచనతోనే 'మిస్టర్ బార్‌టెండర్ & ది క్రూ' సంస్థను ప్రారంభించాను. దేశంలోని ప్రతి గ్రామానికి వెళ్లి పురుషుల కంటే మెజారిటీ మహిళలను ఈ రంగంవైపు ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. మేము ఈ ప్రదేశాల్లో LGBTQ కమ్యూనిటీల అవగాహనను కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే 5 బ్యాచ్‌లకు ట్రైనింగ్ అందించాం. వర్చువల్‌ పాఠాలతో పాటు ముంబై, గోవా, ఢిల్లీలో కూడా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం.

- బారెట్టో

భారతదేశంలో బార్‌టెండింగ్ కళాశాలలు

మిక్సాలజీ & ఫ్లెయిర్ బార్‌టెండింగ్, ప్రొఫెషనల్ బార్‌టెండింగ్ కోర్సు, అడ్వాన్స్ బార్‌టెండింగ్ కోర్సు, క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్ కోర్స్ ఇన్ బార్‌టెండింగ్, సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ వైన్స్ & స్పిరిట్స్, మాలిక్యులర్ మిక్సాలజీ కోర్స్, బేసిక్ ఫ్లెయిర్ బార్‌టెండింగ్, సర్టిఫికేషన్ కోర్స్, బ్లెయిర్‌లో ఎక్స్‌క్లూజివ్ తదితర కోర్సులు ఇందులో ఉంటాయి.

* ఇండియన్ ప్రొఫెషనల్ బార్‌టెండింగ్ అకాడమీ, పుణె

* IIBT (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బార్‌టెండింగ్), చండీగఢ్

* ఫ్లెయిర్ మానియా బార్‌టెండింగ్ అకాడమీ, చెన్నయ్

* ఫెయిర్-ఓ-లాగీ బార్ స్కూల్ అండ్ ఈవెంట్స్, ముంబై

మహిళలను ప్రోత్సహించాలి : షట్భి బసు

మూడు దశాబ్దాలుగా బార్‌టెండింగ్ కెరియర్‌లో కొనసాగిన షట్భి బసు ఈ ఫీల్డ్‌లో అడుగుపెట్టే మహిళలకు మార్గదర్శిగా చెప్పొచ్చు. ఆమె గతంలో మిక్సాలజీపై టెలివిజన్ షో నిర్వహించింది. ఓ దినపత్రికలో కాలమ్‌ సహా ఒక పుస్తకాన్ని కూడా రచించింది. అంతేకాదు STIR (ముంబై) అనే తన సొంత ప్రొఫెషనల్ బార్‌టెండింగ్ అకాడమీని కూడా నడుపుతోంది. మహిళా బార్‌టెండర్ల విషయంలో అసురక్షిత అపోహను తొలగించడంపై షట్భి వాదించింది. 'మహిళా బార్‌టెండర్ల విషయంలో భద్రత గురించి ఎక్కువగా చింతిచాల్సిన అవసరం లేదు. హోటళ్లలో హౌస్ కీపింగ్ లేదా రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లో అర్థరాత్రి పని చేసే మహిళల విషయంలో ఇలాంటివి ఎందుకు పరిగణించరు? ఈ రోజుల్లో ఎక్కువ మంది చదువుకున్న మహిళలు ఇతర వృత్తిలో ఉన్నట్లుగానే ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. హోటల్స్ & రెస్టారెంట్లు, బార్స్‌కు మరింత మెరుపును జోడించగలిగే లేడీ బార్‌టెండర్స్‌ను ప్రోత్సహించాలి' అని ఆమె అభిప్రాయపడింది.

Next Story