- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో కుటుంబం నిద్రలో ఉండగానే.. బంగారం, వెండి ఎత్తుకెళ్లిన దొంగలు!
by Jakkula.Mamatha |
ఇంటి యజమానులు ముందు భాగంలో నిద్రిస్తుండగానే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన కారేపల్లిలో చోటుచేసుకుంది.

X
దిశ,కారేపల్లి: ఇంటి యజమానులు ముందు భాగంలో నిద్రిస్తుండగానే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం కారేపల్లి బస్టాండ్ సెంటర్‌లోని డీసీసీ బ్యాంక్ వెనుక ప్రాంతంలో ఉన్న కేతిమాల సారయ్య నివాసంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలు అపహరించారు. సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్ నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
Next Story






