అన్నం పెట్టడంలేదు

by Ratna Kumari |

వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు చట్ట రిత్యా చర్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

అన్నం పెట్టడంలేదు
X

దిశ, కుబీర్ : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు చట్ట రిత్యా చర్యలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కుటుంబం పరువు పోతుందన్న భయం. నరకాన్ని అనుభవిస్తూ తనలో తాను కుమిలిపోతూజీవిస్తున్న వారు న్నారు.కుమారుడు అన్నం పెట్టడం లేదు. కొడుకు పేరిట ఉన్న పట్టా భూమిని తన పేరిట మార్చాలని ఓ తల్లి సోమవారం కుబీర్ తాసిల్దార్ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామానికి చెందిన జాజుబాయి. నా భర్త గణపతి పేరిట 89 సర్వే నంబర్లో ఒక ఎకరం 30 గుంటలో భూమి పట్టా ఉండేది. భర్త మరణించడంతో నా పెద్ద వారసుడు శంకర్ పేరిట పట్టా మార్చాము. జాజు బాయి పెద్ద కుమారుడు శంకర్ అన్నం పెట్టడం లేదని శంకర్ పేరిట చేసిన పట్టాను తల్లినైనా నా పేరిట పట్టా మార్చాలని తల్లి తాసిల్దార్ కు ఫిర్యాదులో పేర్కొంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూడాలి.

Next Story