- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Daily Horoscope Telugu: ఈ రోజు(24-05-2026) అదృష్టం కలిసి వచ్చే రాశులివే!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ రోజు(మే 24) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో ఆదివారం నాటి ద్వాదశ రాశి ఫలాలు కింద ఇవ్వబడ్డాయి. ఈ రోజు(మే 24) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం..
మేష రాశి
ఇవాళ ఈ రాశి వారికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి అడుగు వేయడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి బడ్జెట్ విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరపు చర్చలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథున రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. అనుకోని వనరుల నుంచి ధనలాభం కలిగే అవకాశం ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు.
సింహ రాశి
ఈ రోజు కొంచెం ఓపికగా ఉండాల్సిన సమయం. పనుల్లో స్వల్ప అడ్డంకులు ఎదురైనా, మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహాయం అందుతుంది. కుటుంబంతో స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కన్య రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు.
తులా రాశి
ఈ రోజు మీ బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయుల నుంచి బహుమతులు లేదా ప్రశంసలు అందుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. ఎవరితో వాదోపవాదాలకు దిగకండి. పనుల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.
మకర రాశి
ఈ రోజు మీకు ఎంతో ఆనందంగా సాగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి.
కుంభ రాశి
ఈ రోజు మీకు విజయాలు వరిస్తాయి. మీ శత్రువులపై మీరే పైచేయి సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రుణాలు తీరిపోయి ఊరట లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి
ఈ రోజు మీకు సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.






