ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. అది లేకపోవడమే రాధే శ్యామ్‌కు మైనస్

by Disha Web |
Radhe Shyam
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ రాధే శ్యామ్ మార్చి 11న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా రన్ టైం దాదాపు 2.30 గంటలకు తక్కవగానే ఉంటుందిని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో సినిమా రన్-టైమ్ చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. రొమాంటిక్ పీరియాడికల్ ఫిల్మ్ కు సంబంధించినదిగా లేదని, సినిమా చాలా స్లోగా సాగుతుందని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత ట్రిమ్ చేస్తారని, 10 నిమిషాలకు పైగా సినిమా కట్ చేసే అవకాశం ఉందని టాక్. అంతేకాకుండా సినిమాను తగ్గించే పనిలో మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎడిటింగ్‌లో పాలుపంచుకున్నారని అలాగే కొన్ని కీలకమైన మార్పులు చేసేందుకు ముందుండి నడిపిస్తున్నారని సమాచారం. దీనికి కోసం రాధే శ్యామ్ నిర్మాతలు కొంత మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు టాక్. ఏది ఏమైనా రొమాంటిక్ డ్రామాలో యాక్షన్ లేకపోవడం ప్రభాస్ చిత్రానికి ప్రధాన లోపంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది . మరి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఆదరిస్తారో చూడాలి.


Next Story