అభిమానాన్ని 'క్యాష్' చేసుకుంటున్న థియేటర్ యాజమానులు.. ఆకాశాన్నంటుతున్న టికెట్ ధరలు

by Dishafeatures2 |
అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్న థియేటర్ యాజమానులు.. ఆకాశాన్నంటుతున్న టికెట్ ధరలు
X

దిశ, సూర్యాపేట : సినీ హీరోల అభిమానుల వీక్నెస్‌ను క్యాష్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు, సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలిసి రంగం సిద్ధం చేసుకున్నారు. వివరాల ప్రకారం అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అగ్రశ్రేణి కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధరలు 400 శాతం అమాంతం పెంచేశారు.

గతంలో బెనిఫిట్ షో టికెట్ ధర మామూలు షో టికెట్ ధర ఒకే రకంగా ఉండేది. కానీ సినిమాకు ఉన్న క్రేజ్ అగ్ర కథానాయకులు నటిస్తుండడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు అమాంతం బెనిఫిట్ షో టికెట్ ధర పెంచి అభిమానుల జేబులను గుల్ల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యాలకు రూ.230 ఇస్తే.. థియేటర్ల యాజమాన్యాలు అభిమాన సంఘాల నాయకులకు రూ.500 విక్రయిస్తున్నారని ఓ కథానాయకుడు అభిమాని వాపోయారు. టికెట్ ధరలు ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండాలని కానీ డిస్ట్రిబ్యూటర్లు చెబితే పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అధికారులు జోక్యం చేసుకోవాలి..

బెనిఫిట్ షో టికెట్స్ ధరల పెరుగుదలపై సూర్యాపేట జిల్లా అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

Next Story

Most Viewed