- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కథలు వింటూ ఇంకా నిద్రపోతున్నావా.. మేల్కొనే ఉన్నావా? యంగ్ హీరోకు చేదు అనుభవం..
కోలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ కుమార్ (Ashwin Kumar)చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ కుమార్ (Ashwin Kumar)చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తెలుగులో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇక 2022లో ‘ఎన్న సొల్ల పొగిరై’ (Enna Solla Pogirai)మూవీ సమయంలో అశ్విన్ ఒకేరోజు 40 కథలు విన్నానని.. అవి చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అది కాస్ వివాదాస్పదం కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఎవరినీ బాధపెట్టాలని ఉద్దేశం తనకు లేదని క్షమాపణలు చెప్పాడు. తాజాగా, ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హీరో అశ్విన్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇందులో ఓ రిపోర్టర్ దారుణంగా అవమానించాడు. దీంతో వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్‌లో నిద్రపోలేదా? అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయాను.
బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు.. తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు. నన్ను అవమానించడానికా?బాధపెట్టడానికా? అని ఫైర్ అయ్యాడు. కాగా.. దాదాపు రెండేళ్ల తర్వాత ‘హాట్‌స్పాట్-2’తో రాబోతున్నాడు. విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తంబి రామయ్య, ఆదిత్య భాస్కర్, ప్రియా భవాని శంకర్, భవాని శ్రీ, సంజన తివారి, భాస్కర్,రక్షన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘హాట్ స్పాట్’కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 23న థియేటర్స్‌లోకి రానుంది.






