- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచానికి కాలేయ గండం..130 కోట్ల మందికి ‘లివర్’ సమస్యలు
ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి కాలేయ వ్యాధి! 1990 నుండి 143% పెరిగిన బాధితులు. లాన్సెట్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.

దిశ, వెబ్ డెస్క్: కాలేయ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తున్నాయని ‘ద లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ’ జర్నల్ హెచ్చరించింది. తాజా నివేదిక ప్రకారం.. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కోట్ల మంది మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD)తో బాధపడుతున్నట్లు తెలింది. ఇది 1990 తో పోలిస్తే ఏకంగా 143 శాతం పెరగడం గమనార్హం. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఊబకాయం (Obesity) వంటి కారణాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
ముంచుకొస్తున్న ముప్పు..
గతంలో దీనిని 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' (NAFLD) అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని MASLDగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం పెద్దల్లోనే కాకుండా, తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా కనిపిస్తుండటం వైద్య నిపుణులను కలవరపెడుతోంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది లివర్ సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఈ వ్యాధి భారం పెరుగుతోందని, ప్రజలు ముందస్తుగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.






