- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వడగళ్ల వాన బీభత్సం
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. సడెన్‌గా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన (Heavy hailstorm) కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించి పోవడమే కాకుండా, వీధులన్నీ తెల్లటి వడగళ్లతో నిండిపోయి కశ్మీర్‌ను తలపించాయి. ఈ హఠాత్తు పరిణామంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు.
ఈ అకాల వర్షం, వడగళ్లు కర్నాల్ పరిసర ప్రాంతాల్లోని పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న గోధుమ, ఆవాలు, శీతాకాలపు కూరగాయల పంటలు వడగళ్ల దెబ్బకు నేలకొరిగి భారీగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయడానికి 'గిర్దావరి' నిర్వహించి, నష్టపరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.






