'మేకపాటి మృతదేహం వద్ద మంత్రుల వెకిలి వేషాలు'.. వీడియో వైరల్!

by Web Desk |
మేకపాటి మృతదేహం వద్ద మంత్రుల వెకిలి వేషాలు.. వీడియో వైరల్!
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రి నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో ఉంచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు.




అయితే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఒక చోట కూర్చుని నవ్వుతున్న వీడియోను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క పక్కన, తమ సహచర మంత్రి శవం ఉంది.

కేవలం 49 ఏళ్ళు హఠాత్తుగా చనిపోయాడు. అయినా ఏ మాత్రం బాధ లేకుండా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎలా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, వెకిలి వేషాలు వేస్తున్నారో చూడండి. ఇలాంటి వారిని సైకోలు అనాలా ? ఏమనాలి ? అంటూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.



Next Story

Most Viewed