- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం
by Malleboina Mahesh |
దిశ, దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మరణించిన సంఘటన దుమ్ముగూడెం మండలం

X
దిశ, దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మరణించిన సంఘటన దుమ్ముగూడెం మండలం సమీపంలోని చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా, కిష్టారం లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన దినం కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కిష్టారం పక్క గ్రామం పైతుల కుంట గ్రామానికి చెందిన తమా ఐతి అనే మహిళ, వెల్కన గూడెం కు చెందిన పాయం ముత్తయ్య మృతి చెందారు. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ తొట్టిలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి.
Next Story






