- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమా మీ హృదయాలను కదలిస్తుంది: నిర్మాత
నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’.

దిశ, వెబ్‌డెస్క్: నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు వేణు నక్షత్రం ఈ సందర్భంగా తెలిపారు. చిత్ర నిర్మాత అవంతిక నక్షత్రం మాట్లాడుతూ.. ‘ఆటాడిన పాట’ మీ హృదయాలను కదిలిస్తుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుంది’ అని తెలిపారు.






