- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ నాయకులు దళారులగా మారి వారితో కలిసి రైతులను దగా చేస్తున్నారు: టీడీపీ నేత
by Manoj |
దిశ, ఏపీ బ్యూరో: రైతు పక్షపాతిగా చెప్పుకునే ప్రభుత్వం ప్రతి అంశంలోనూ వారిని దగా చేస్తున్నదని..latest telugu news

X
దిశ, ఏపీ బ్యూరో: రైతు పక్షపాతిగా చెప్పుకునే ప్రభుత్వం ప్రతి అంశంలోనూ వారిని దగా చేస్తున్నదని టీడీపీ నేత నక్కా ఆనంద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నదని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయ లేదని మండిపడ్డారు. వైసీపీ నాయకులు దళారులగా మారి మిల్లర్లతో కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు. వ్యవసాయ పంపు సెట్ల మీటర్ల విషయంలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
Next Story






