పాముతో ఆటలా? కనుబొమ్మలపై కాటేసి.. అలాగే పట్టుకోవడంతో..

by Dishanational1 |
పాముతో ఆటలా? కనుబొమ్మలపై కాటేసి.. అలాగే పట్టుకోవడంతో..
X

దిశ, ఫీచర్స్ : పాములంటే సాధారణంగా అందరికీ భయమే. అలాంటిది పొరపాటున కంటపడ్డాయే అనుకో.. పరుగులు పెట్టేస్తాం. తిరిగి ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు సంకోచిస్తాం. కానీ కొందరు వ్యక్తులు మాత్రం వాటితో సరదగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు కాగా.. ఆశ్చర్యకరంగా ఇలాంటి ఎంజాయ్‌మెంట్ సమస్యాత్మకంగా మారితే దారుణంగా ఉంటుంది కదా. అలాంటి పాము వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి రంగురంగులుగా కనిపించే సన్నని పాముని చేతితో పట్టుకుని షో చేస్తుండగా.. ఆ పాము ఒక్కసారిగా అతని ఐబ్రోస్‌పై దాడి చేసి గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో స్నేక్ వరల్డ్ అకౌంట్ నుంచి షేర్ చేయగా.. ఈ పాము విషపూరితమైనదా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.

Next Story