- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఇంజనీర్ల సేవలు వెలకట్టలేనివి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటంలో పవర్ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు వెలకట్టలేనివని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటంలో పవర్ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవలు వెలకట్టలేనివని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ‘తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ-2026ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, అసోసియేట్ ప్రెసిడెంట్ జనప్రియ, అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రమేష్, వెంకటేశ్వర్ రావు, బ్రహ్మాజీ, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






