తాగునీటి ఎద్దడి లేకుండా పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం

by Batti.Sumithra |

ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ 4వ వార్డులో తాగునీటి ఇబ్బందులు తలెత్తిన విషయం వార్డు నెంబర్ ఎంపెల్లి రాజు తెలపగా వెంటనే సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు తక్షణమే స్పందించారు.

తాగునీటి ఎద్దడి లేకుండా పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం
X

దిశ, ఏటూరునాగారం : ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ 4వ వార్డులో తాగునీటి ఇబ్బందులు తలెత్తిన విషయం వార్డు నెంబర్ ఎంపెల్లి రాజు తెలపగా వెంటనే సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు తక్షణమే స్పందించారు. వార్డు ప్రజల నీటి సమస్యను తీర్చేందుకు శనివారం స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకుని, కొబ్బరికాయలు కొట్టి చేతిపంపు పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యతని, వార్డులో నీటి సమస్య త్వరలోనే పూర్తిగా తొలిగిపోతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వావిలాల ముత్తయ్య, మాజీ వార్డ్ మెంబర్ దేపాక మల్లమ్మ, దేపాక శ్రీరామ్, వావిలాల రామ్ నర్సయ్య, వావిలాల కిషోర్, కొండాయి చిన్ని, నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Next Story