- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డు స్థాయికి చేరిన కిలో మల్లెపూల ధర.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగడం పక్కా!
సంక్రాంతి (Sankranti) పండగ వేళ మల్లెపూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranti) పండగ వేళ మల్లెపూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తమిళనాడు (Tamilnadu) మధురై (Madhurai)లో ప్రసిద్ధ ‘మధురై మల్లిపూవు’ ధరలు ఎన్నడూ లేని విధంగా కిలో రూ.12 వేల రికార్డు స్థాయికి చేరాయి. గత వారం కేవలం కిలో రూ.2 వేల వరకు ఉన్న మల్లెపూల ధర డిసెంబర్ 9 నాటికి రూ.6 వేలతో ప్రారంభమై, సరఫరా తీవ్రంగా తగ్గిపోవడంతో ఉసిలంపట్టి, తిరుమంగలం వంటి ప్రధాన మార్కెట్లలో రూ.9 వేల నుంచి రూ.12 వేలకు వరకు చేరింది. మధురై మట్టుతవని మార్కెట్‌లో కూడా రూ.6 వేల వరకు అమ్ముడవుతున్నట్లుగా వ్యాపారులు తెలిపారు.
వాతావరణ మార్పుల ఎఫెక్ట్..
విపరీతంగా కురుస్తున్న మంచు , తేమ, మేఘావృత వాతావరణం, పొగమంచు వంటి వాతావరణ కారణాల వల్ల మల్లెపూల సాగుపై ప్రభావం పడింది. రైతులు ఎరువులకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేసినా దిగుబడి మాత్రం రావడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు, ఇంటి అలంకరణ, ఆచారాలకు మల్లెపూలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మార్కెట్‌లలో రోజుకు కేవలం 30 కిలోల మల్లెపూలు మాత్రమే అందుబాటులోకి వస్తుండగా.. అవి కాస్త ఉదయం 11లోపే అమ్ముడవుతున్నాయని వినియోగాదారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు మల్లెపూల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, పండుగ ముగిసే వరకు ఈ ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా ధరల వల్ల సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంగా పూలు తప్పనిసరి అయినప్పటికీ, ఈ ధరలు చాలామందికి భారంగా పరిణమించాయి.






