ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలన మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ప్రజలంతా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, నకిరేకల్ : రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలన మళ్లీ కావాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు అంతా కృషి చేయాలి అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.

రైతులకు రైతు భరోసాను ఎగ్గొట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మూసిసుందరీకరణ పేరిట దోచుకునేందుకు పేదల ఇండ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. డిజిటల్ సభ్యత్వ నమోదు అదే విధంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పక్కన పెట్టి కేవలం ప్రెస్ మీట్ లకే ఎమ్మెల్యే పరిమితమయ్యారని ఆరోపించారు. స్థాయిని మరిచి కేసీఆర్ కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి తప్పదన్నారు. పదవులు వచ్చినంత మాత్రాన కొమ్ములు వచ్చాయి అనే తీరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ , నకిరేకల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇన్చార్జి గుజ్జ దీపిక యుగేందర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story