POCO నుంచి త్వరలో 5G స్మార్ట్ ఫోన్..

by Disha Web Desk 17 |
POCO నుంచి త్వరలో 5G స్మార్ట్ ఫోన్..
X

దిశ,వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ POCO నుంచి కొత్త మోడల్ POCO X4 Pro 5G రానుంది. ఈ ఫోన్ మార్చి 28న మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదలవుతుందని POCO ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇది గ్లోబల్ వేరియంట్‌లో వచ్చినటువంటి 108MP కెమెరాకు బదులుగా 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుందని సమాచారం.

స్పెసిఫికేషన్స్..

-6.67 FHD+ డిస్‌ప్లే, AMOLED ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ను కలిగి ఉంది.

-Android 11-ఆధారిత MIUI 13 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.

-Adreno 619 GPUతో Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

-8GB RAM 256GB UFS 2.2 మెమరీని అందిస్తోంది.

-64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి.

-పంచ్-హోల్ కటౌట్‌లో16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

-67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

-సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

-లేజర్ బ్లూ, పోకో ఎల్లో, లేజర్ బ్లాక్ అనే మూడు కలర్‌లలో లభిస్తుంది.

-ధర సుమారు రూ. 25,500 ఉండే అవకాశం ఉంది.








Next Story

Most Viewed