- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెదర్లాండ్స్ యువరాణుల మర్డర్ ప్లాన్.. మారణాయుధాలు స్వాధీనం
నెదర్లాండ్స్ రాజకుటుంబానికి చెందిన యువరాణులపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : నెదర్లాండ్స్ రాజకుటుంబానికి చెందిన యువరాణులపై హత్యాయత్నానికి కుట్ర పన్నిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. డచ్ యువరాణి కేథరీనా-అమాలియా, ఆమె సోదరి అలెక్సియాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరిలో ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించినట్లు అక్కడి పోలీసులు అధికారికంగా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ అత్యంత సున్నితమైన విషయాన్ని ఇన్ని రోజులు రహస్యంగా ఉంచిన అధికారులు, నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాతే వివరాలను బయటపెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి వద్ద రెండు గొడ్డళ్లతో పాటు రాజకుటుంబంపై విద్వేషాన్ని వెలిగక్కే రాతప్రతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నెదర్లాండ్స్ రాజు విల్లెం-అలెగ్జాండర్ 59వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వార్త బయటకు రావడం గమనార్హం. అయితే యువరాణి కేథరీనా-అమాలియా ఇలాంటి భద్రతా ముప్పులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు, గత కొన్నేళ్లుగా ఆమె అనేకసార్లు ఇలాంటి ప్రాణహానిని ఎదుర్కొన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. గత ఏడాది మొదట్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాల నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు రావడంతో ఆమె ఏకంగా తన దేశాన్ని వదిలి ఏడాది పాటు స్పెయిన్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది.






