తెలంగాణ లౌకిక రాష్ట్రం: మంత్రులు

by Disha Web Desk 2 |
తెలంగాణ లౌకిక రాష్ట్రం: మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో బుధవారం రంజాన్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ లౌకిక రాష్ట్రం అని, ప్రధాన పండుగలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామన్నారు. ఏప్రిల్ 3 నుంచి రంజాన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మసీదులు, ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. నీళ్లు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం రాకుండా చూడాలని సూచించారు.

అవసరమైన పాలు, చక్కెర, బియ్యం, వంట గ్యాస్, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉండాలని, వీధి దీపాలన్నీ వెలిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ ఉల్ జాఫ్రీ, సయ్యద్ రియాజ్ ఉల్ హసన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మౌజంఖాన్, అహ్మద్ బిన్ బలాల, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మీరాజ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed