ఆత్మహత్యా.. అదుపు తప్పాడా..!

by Manoj |   (  Updated:2022-03-24 17:29:50  IST  )

దిశ, జవహర్ నగర్: ఆర్థిక ఇబ్బందులతో సతమతం పడుతూ తీవ్ర మానసిక..latest telugu news

ఆత్మహత్యా.. అదుపు తప్పాడా..!
X

దిశ, జవహర్ నగర్: ఆర్థిక ఇబ్బందులతో సతమతం పడుతూ తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి మూడో అంతస్తు నుండి కిందపడి మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన వెంకన్న (49) తన కుటుంబంతో కలిసి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు.

గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతూ ధూమపానం తాగేవాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం బీడీ తాగుతూ, భవనంపైకి వెళ్ళి మూడో అంతస్తు నుండి నేలకొరిగాడు. అక్కడున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబీకులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడో అంతస్తు నుండి కాలు జారి పడ్డాడా...? లేక మానసిక ఆందోళనతో దుర్మరణం చెందాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనను విన్న బాధిత కుటుంబీకులు సంఘటన స్థలంలో విలవిలలాడి పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story