కపిల్ శర్మ షో బ్యాన్ చేయాలని డిమాండ్.. థాంక్స్ చెప్పిన కమెడియన్..

by Disha Web Desk 17 |
కపిల్ శర్మ షో బ్యాన్ చేయాలని డిమాండ్.. థాంక్స్ చెప్పిన కమెడియన్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ 'ది కశ్మీర్ ఫైల్స్' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గానూ సక్సెస్ అయింది. కానీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకు తమ టీమ్‌ను ఆహ్వానించలేదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆరోపించాడు. దీంతో కపిల్ శర్మకు వ్యతిరేకంగా నెగెటివ్ కామెంట్స్ రావడమే కాదు.. ఈ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు నెటిజన్లు. ఈ క్రమంలో ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. సదరు ప్రోగ్రాం నుంచి తమకు ఇన్విటేషన్ అందినా.. సీరియస్ ప్రాజెక్ట్ అని తనే వద్దన్నానని రీసెంట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీంతో ఈ కాంట్రవర్సీకి బ్రేక్ పడగా.. అనుపమ్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు కపిల్.



Next Story

Most Viewed