- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూల్చివేతలు వెంటనే ఆపండి: హైకోర్టు
దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో కూల్చివేతలు వెంటనే ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వస్తువులు తీసుకునేందుకు వ్యాపారులను అనుమతించాలని స్పష్టం చేసింది.

X
దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో కూల్చివేతలు వెంటనే ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వస్తువులు తీసుకునేందుకు వ్యాపారులను అనుమతించాలని స్పష్టం చేసింది. నెల రోజులు మార్కెట్ తెరవాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడమే కాకుండా.. పోలీసులను మోహరించి మార్కెట్ కూలుస్తున్నారని వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, గడ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేతల తీరు దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 14 వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






