ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలు.. వైద్య సిబ్బందికి సన్మానం..

by Dishafeatures2 |
ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమాలు.. వైద్య సిబ్బందికి సన్మానం..
X

దిశ, గుండాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా బాద్ కార్యక్రమాల పిలుపు మేరకు ఆదివారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిని ప్రధానంగా కరోనా సందర్భంలో అహర్నిశలు కృషి చేసిన ఏఎన్ఎంలను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు వట్టం రాంబాబు బాబు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రానున్న బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కెసీఆర్ కిట్, వితంతు పింఛన్‌లకు నెల నెలా రూ.2000, స్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఇవే కాక అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు. తెల్లం భాస్కర్, రాంబాబు టీ రాము, బుగ్గల రామయ్య, ఈశ్వరి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed