- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర మీసాల స్వామికి స్వర్ణ కిరీటం..
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమరవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు- latest Telugu news

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమరవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేయిస్తున్నట్లు మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రులు మల్లన్న స్వామికి చేయించే బంగారు కిరీటం నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కొంగు బంగారం.. పల్లె జాతరకు, పల్లె ప్రజలకు కొంగు బంగారం కొమరెళ్లి మల్లన్న అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖు పుణ్య క్షేత్రాలను భక్తులకు సరిపడా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పురాతన ప్రాచీన ఆలయాలకు గొప్ప ప్రాశస్త్యం తెస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే మల్లన్న స్వామికి రూ.4 కోట్లతో ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన చేపిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జోన్ ఉప కమీషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.






