పార్టీ బలోపేతమే లక్ష్యం: డీసీసీ అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం

by Malleboina Mahesh |

జిల్లాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి! డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. పది రోజుల పాటు శిక్షణ.

పార్టీ బలోపేతమే లక్ష్యం: డీసీసీ అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన నాయకులు జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలతో సన్నిహితంగా మమేకమవ్వాలని టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సమన్వయం, క్రమశిక్షణ, సేవా భావంతో పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం రెండో రోజు కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.

సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణా శిబిరం ద్వారా పార్టీ సంస్థాగత బలోపేతానికి, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధికి దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాల వారీగా డీసీసీ అధ్యక్షులకు సమగ్ర అవగాహన కల్పిస్తూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై స్పందన విధానాలు, పార్టీ విధానాల అమలు, బూత్ స్థాయి బలోపేతం వంటి అంశాలపై విస్తృత చర్చలు నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహ రచన, సోషల్ మీడియా మరియు మీడియా నిర్వహణ, కార్యాచరణ ప్రణాళికలు వంటి కీలక అంశాలపై నిపుణుల ద్వారా డీసీసీ చీఫ్​లకు శిక్షణ అందించనున్నారు.

Next Story