- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల్లో BJP అభ్యర్థుల విజయమే లక్ష్యం.. మల్క కొమరయ్య కీలక వ్యాఖ్యలు
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ విజయం లక్ష్యమని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ విజయం లక్ష్యమని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఇవాళ ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్ధవంతంగా వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో బీజేపీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ బీజేపీ టౌన్ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, రూరల్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సౌదరి మహేందర్ యాదవ్ తదితర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






