ఆడబిడ్డ పుట్టుక మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.. హాలీవుడ్ స్టార్స్

by Dishanational1 |
ఆడబిడ్డ పుట్టుక మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.. హాలీవుడ్ స్టార్స్
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ కపుల్ సోఫీ టర్నర్-జో జోనాస్ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. 2019లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2020లో కూతురు 'విల్లా'ను స్వాగతించగా తాజాగా మరో బేబీ తమ జీవితంలోకి రాబోతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కూడా ఆడపిల్ల పురుడుపోసుకోనున్నట్లు ముందే ప్రకటించిన జంట.. తన రాక వారికి మరింత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. 'జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే తరువాతి తరాన్ని పెంచడం. నా మొదటి కుమార్తె శక్తి నుంచి మరో శక్తిని పొందడం. మా కుటుంబాన్ని విస్తరించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. అత్యుత్తమమైన ఆశీర్వాదం అందిచండి' అంటూ తమ అభిమానులను కోరారు.



Next Story

Most Viewed