- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు ప్రాణాలను బలిగొన్న రాంగ్ రూట్.. ఫ్లైఓవర్ ఎక్కిన కాసేటికే..
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్- latest Telugu news

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ శివారులో జాతీయ రహదారి 161 వద్ద రాంగ్ రూట్‌లో వెళ్తున్న బైక్ లారీని ఢీకొనడంతో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం జలాల్పురం గ్రామానికి చెందిన బేగరి లక్ష్మయ్య, చిత్రమ్మ భర్తలిద్దరూ బైక్‌పై మెదక్ జిల్లా శంకరంపేట నుండి నిజాంపేట్ వైపు వెళ్తున్నారు. నిజాంపేట్ శివారులో నేషనల్ హైవేపై ఉన్న ఫ్లైఓవర్ మీదకు రాంగ్ రూట్లో ఎక్కారు. రాంగ్ రూట్లో వెళ్తున్నామని తెలుసుకుని బైక్‌ను వెనక్కి మలుపుతుండగా.. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్రమా అక్కడికక్కడే మరణించగా.. లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందాడు. సంఘటన స్థలానికి నారాయణఖేడ్ పోలీసులు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.






