- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొండిచేయి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిలాబాద్ వాసులకు ఈ బడ్జెట్ ఉసూరుమనిపించింది.

దిశ ప్రతినిధి, నిర్మల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిలాబాద్ వాసులకు ఈ బడ్జెట్ ఉసూరుమనిపించింది. కొత్త ప్రాజెక్టుల విషయం పక్కన పెడితే పాత ప్రాజెక్టులు పెండింగ్ పనుల విషయంలోనూ పెద్దగా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం జిల్లా వాసుల్లో నిరుత్సాహాన్ని నింపింది. మరోవైపు రైల్వే బడ్జెట్ లో కొత్త రైల్వే లైన్ల కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రైల్వే లైన్ల విషయం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటుపై కూడా స్పష్టత రాకపోవడం జిల్లా వాసుల్లో నిరుత్సాహాన్ని నింపుతున్నది.
రైలు కూత ఏది... విమానం మోత ఏది..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రైల్వే లైనుకు సంబంధించి సుమారు నాలుగు దశాబ్దాలుగా వ్యవహారం నడుస్తూనే ఉన్నది. గతంలో ఎలా ఉన్నా ఈసారి బడ్జెట్లో కచ్చితంగా ఆర్మూర్- నిర్మల్, ఆదిలాబాద్ రైల్వే లైన్ పై స్పష్టత వస్తుందని, నిధులు విడుదల అవుతాయని భావించారు అయితే ఈ రైల్వే లైను వ్యవహారంపై ఎంపీ జీ నగేష్ తీవ్రస్థాయిలో కృషి చేశారు. కలువని అధికారి లేడు... విషయం వినని ప్రజాప్రతినిధి లేడు అన్న స్థాయిలో ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం విశేషంగా కృషి చేశారు. మరోవైపు రైల్వే సాధన కమిటీ సైతం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేసింది. అయినప్పటికీ ఈ రైల్వే లైన్ పై ఎలాంటి స్పష్టత ఇప్పటిదాకా రాలేదు.
కొత్త రైల్వే లైన్ల విషయంలో నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ తెలంగాణకు కేటాయించిన నిధులు ఎన్ని..?? ఒకవేళ నిధులు కేటాయిస్తే ఆ కేటాయింపుల్లో ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ రైలు ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. మరోవైపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి సైతం ప్రతిపాదనలు ఉన్నాయి దీనిపై కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపి సర్వే కూడా నిర్వహించింది. భూసేకరణకు గతంలోనే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించలేదు. దీంతో రైలు, విమానం యోగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇక లేదా అన్న అభిప్రాయాలు జిల్లా వాసుల్లో వ్యక్తం అవుతున్నాయి.
సీసీఐ గతి అంతేనా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా గతంలో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ ఫ్యాక్టరీ పై సైతం కేంద్రం బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని గత ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల లో ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకున్నారని రాజకీయ పార్టీలు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ దీనిపై కూడా కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
మిగతా ప్రాజెక్టులపై..
ఇదిలా ఉంటే టూరిజం ప్యాకేజీ కి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం సహా అనేక జలపాతాలు, సహ్యాద్రి పర్వతాలు టూరిజం రంగానికి భూతం ఇచ్చేలా ఉన్నాయి. వీటిపై కూడా కేంద్రం ఒక్క పైసా ఇస్తున్నట్లు బడ్జెట్లో ప్రస్తావన లేదు మరోవైపు బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అభివృద్ధితోపాటు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై పట్టించుకోలేదు.






