- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో జోరు తగ్గిన కారు పార్టీ... జోష్ లో హస్తం
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ చతికిలపడగా... అదే సమయంలో కాంగ్రెస్ భారీ సీట్లు సాధించి మంచి జోష్ లో ఉంది.

దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లకు గాను కాంగ్రెస్9 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని సత్తా చాటగా బీఆర్ఎస్ మూడు మున్సిపాలిటీల్లో గెలిచి తన ఉనికి కాపాడుకుంది. రెండు కార్పొరేషన్లలో ఒకకార్పొరేషన్ లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోగా మరో కార్పొరేషన్ రామగుండం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒక విప్ మరో నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా మంథని, ధర్మపురి లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా ప్రభుత్వ విప్ ఉన్న వేములవాడ లో ఉన్న ఏకైక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. రామంగుండం పెద్దపల్లిలో సైతం కాంగ్రెస్మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్‌చేసింది ఇక జగిత్యాల జిల్లాలో జగిత్యాల మెట్ పల్లి కోరుట్ల మున్సిపాలిటీలను గెలుచుకుని కాంగ్రెస్పట్టు సాధించగా రాయికల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలకు గాను జమ్మికుంటలో బీఆర్ఎస్ గెలుపొందగా హుజురాబాద్ లో కాంగ్రెస్ పట్టు సాధించింది. జిల్లా కేంద్రంలో మాత్రం పార్టీ నేతల స్వయంకృపారధంతో కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుని కార్పొరేషన్ పై కాషాయజెండాను ఎగురవేసింది
సిరిసిల్ల మున్సిపాలిటీలో పట్టుసాధించుకున్న బీఆర్ఎస్
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చతికిల పడ్డా కారుపార్టీ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్లలో మాత్రం తన పట్టుసడలకుండా సిరిసిల్లా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఇలాకాలో కారు పరిస్థితి ఎలా ఉండబోతుంది. అనే చర్చజోరుగా సాగగా ఓక తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వెలుబడ్డ ఫలితాలే ఇక్కడకూడా వెలువడే అవకాశం ఉంది అనే చర్చకూడ సాగింది. అయినప్పటికి నేతన్నలు బీఆర్ఎస్ పార్టికి మరోమారు అండగా నిలిచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లో కారు గుర్తు చతికిల పడగా జమ్మికుంట రాయికల్ మున్సిపాలిటీల్లో ఓటర్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. తెలంగాణా ఉద్యమం లో కేంద్రబిందువుగా నిలిచిన కరీంనగర్ లో ఒకప్పుడు కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలతో సరిపెట్టికోక తప్పని పరిస్థితి నెలకొంది.
12 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్ల చైర్మన్, వైస్చైర్మన్లు
1కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ బీజేపీ,
డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు బీజేపీ ఎన్నికయ్యారు.
2 హుజూరాబాద్మున్సిపల్చైర్పర్సన్గా రొంటాల సుహాసిని కాంగ్రెస్, వైస్ చైర్ పర్సన్ గూడూరు అంజలి కాంగ్రెస్ ఎన్నికయ్యారు.
3 జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా ములుగు ప్రశాంత్ కుమార్బీఆర్ఎస్, వైస్ చైర్మన్ ఎండీ జావిద్ బీ ఆర్ఎస్ ఎన్నికయ్యారు.
4 జగిత్యాల మున్సిపల్చైర్పర్సన్గా సమీండ్ల వాణి కాంగ్రెస్,
వైస్ చైర్ పర్సన్‌గా జీనత్ పర్వీన్ కాంగ్రెస్ ఎన్నికయ్యారు.
5)రాయికల్ మున్సిపల్చైర్పర్సన్గా కట్కం రవీందర్
బీఆర్ఎస్ వైస్ చైర్ పర్సన్‌గా తురగ సౌజన్య బీఆర్ఎస్ ఎన్నికయ్యారు.
6)మెట్ పల్లి చైర్మన్మైలారపు లింబాద్రి కాంగ్రెస్, వైస్ చైర్మన్‌గా ఓంకారి నవీన్ కాంగ్రెస్ ఎన్నికయ్యారు.
7) కోరుట్ల చైర్ పర్సన్ తిరుమల వసంత కాంగ్రెస్
వైస్ చైర్ పర్సన్‌గా మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్ కాంగ్రెస్ ఎన్నికయ్యారు.
8) ధర్మపురి చైర్ పర్సన్‌గా వేముల నాగలక్ష్మి కాంగ్రెస్ ,వైస్ చైర్ పర్సన్‌గా ఇందారపు రామన్న కాంగ్రెస్ ఎన్నికయ్యారు.
9)పెద్దపల్లి చైర్మన్ గా నూగిళ్ల మల్లయ్య కాంగ్రెస్
వైస్ చైర్మన్‌గా: ముస్కాన్ నాజ్ కాంగ్రెస్ ఎన్నికయ్యరు.
10) రామగుండం కార్పొరేషన్ మేయర్‌గా మహంకాళి స్వామి
కాంగ్రెస్, డిప్యూటీ మేయర్ గా పాత పల్లి ఎల్లయ్య యాదవ్ కాంగ్రెస్ఎన్నికయ్యారు.
11) మంథని మున్సిపల్ చైర్మన్ గా ఒడ్నాల శ్రీనివాస్ కాంగ్రెస్,వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డి కాంగ్రెస్ఎన్నికయ్యారు.
12) సుల్తానాబాద్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
13) సిరిసిల్ల చైర్ పర్సన్ గా జిందం కళ చక్రపాణి బీఆర్ఎస్,
వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్ బీఆర్ఎస్ ఎన్నికయ్యారు.
14) వేములవాడ మున్సిపల్చైర్మన్గా చైర్మన్ పుల్కం రాజు కాంగ్రెస్వైస్ చైర్మన్‌గా నరాల శేఖర్ కాంగ్రెస్ ఎన్నికయ్యారు.






