ఉపరాష్ట్రపతిని అయోమయంలో పడేసిన ఆ నటుడి గడ్డం

by Malleboina Mahesh |

దిశ, వెబ్ డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మలయాళ నటుడు సురేష్ గోపి గడ్డం అయోమయంలో latest telugu news..

ఉపరాష్ట్రపతిని అయోమయంలో పడేసిన ఆ నటుడి గడ్డం
X

దిశ, వెబ్ డెస్క్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మలయాళ నటుడు సురేష్ గోపి గడ్డం అయోమయంలో పడేసింది. పార్లమెంట్ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి నామినేటెడ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే సభ చైర్మన్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండగా.. అది మాస్కా.. లేదా గడ్డమా..? అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురేష్ గోపి గడ్డన్ని ఉద్దేశించి నవ్వుతూ అడిగాడు.

దీంతో సభలో అందరూ తెగ నవ్వేశారు. దీనికి సురేష్ గోపి కూడా నవ్వుతూ.. ఇది గడ్డమే అని.. రాబోయే సినిమాలో కొత్త లుక్ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Next Story