బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన నటి.. కారులో ప్రయాణిస్తూ..

by Web Desk |
బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన నటి.. కారులో ప్రయాణిస్తూ..
X

దిశ, సినిమా: తమిళ్ యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ 'మాస్టర్' సినిమా తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నటి.. త్వరలో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతానని ఊరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రేమికుల రోజు సందర్భంగా ప్రియుడితో మాట్లాడినట్లు తెలిపిన బ్యూటీ.. అతనికి లవ్ యూ కూడా చెప్పినట్టుగా ఓ వీడియోను కూడా షేర్ చేసింది. 'ఎట్టకేలకు ఆ రహస్యం చెప్పేస్తున్నా. ఈ అందమైన వాలెంటైన్ డేను నమ్మలేకపోతున్నా. ఇది నాదే అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఇది ఎంతో అద్భుతమైనది, ఆకర్షణీయమైనది, సురక్షితమైనది. నా ప్రయాణాన్ని ముందుకు సాగించే గొప్ప భాగస్వామి. మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. కానీ అదేంటో తెలుసుకోవడం ఇప్పుడు మీ వంతే' అంటూ స్కోడా స్లావియా కారు యాడ్‌ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఫ్యాన్స్, నెటిజన్స్ 'మా ఎమోషన్స్‏తో ఎందుకిలా ఆడుకున్నావు' అని ఫైర్ అవుతున్నారు.

https://www.instagram.com/tv/CZ8uTWbl3JG/?utm_source=ig_web_copy_link


Next Story

Most Viewed