- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా నిరాకరించడానికి కారణం అదే: భావన
మలయాళ ముద్దుగుమ్మ భావన(Bhavana) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ భావన(Bhavana) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘అనోమి’ (Anomie) జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భావన..తాను మలయాళ సినిమాలకు ఎందుకు దూరమవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. ‘‘నా జీవితంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. ఒకానొక సమయంలో మలయాళ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం కేవలం ఒక క్షణంలో తీసుకున్నదే అయినా, ఆ తర్వాత నాకు అదే సౌకర్యంగా అనిపించింది. పెళ్లి తర్వాత నా కుటుంబంతో ప్రశాంతంగా గడిపాను. ఆ సమయంలో మలయాళ సినిమా ప్రపంచంతో సంబంధం లేకపోవడమే నాకు నచ్చింది’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
విరామ సమయంలో తనకు వచ్చిన భారీ ఆఫర్ల గురించి చెబుతూ భావన అందరినీ ఆశ్చర్యపరిచింది. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తాను నో చెప్పానని ఆమె వివరించారు. ‘‘ఆషిక్ అబు నుంచి మమ్ముట్టి సినిమా వరకు ఎందరో స్నేహితులు ఫోన్ చేసి కథ వినమని అడిగారు. కానీ నేను వద్దని చెప్పేశాను. అలా ఎందుకు చేశానో ఇప్పటికీ నాకు సరైన సమాధానం తెలియదు. కానీ కన్నడ సినిమాల్లో నటిస్తూ, షూటింగ్ పూర్తి కాగానే ఇంటికి వెళ్ళిపోవడం నాకు ఒక కంఫర్ట్ జోన్‌ను ఇచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. చివరకు ‘నితికాక్కక్కోరు ప్రేమొండార్న్’ సినిమాతో తన మనసు మార్చుకుని మళ్ళీ మలయాళంలోకి రీ-ఎంట్రీ ఇచ్చానని, ఇప్పుడు వస్తున్న ‘అనోమి’ సినిమా తన కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని భావన చెప్పుకొచ్చింది.






