Weekly Horoscope :గ్రహాల అనుకూలత.. ఈ వారం బలమైన వివాహ యోగం ఉన్న రాశులు ఇవే!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-28 02:33:33  IST  )

ఈ వారం(జూన్ 28 నుంచి జూలై 04) గ్రహాల కలయిక బట్టి 12 రాశులకు ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Weekly Horoscope :గ్రహాల అనుకూలత.. ఈ వారం బలమైన వివాహ యోగం ఉన్న రాశులు ఇవే!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. ఈ వారం బుధుడు, శుక్రుడు, సూర్యుడి మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి యోగ కాలం, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ వారం(జూన్ 28 నుంచి జూలై 04) గ్రహాల కలయిక బట్టి 12 రాశులకు ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి

ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ సూర్యుడు, చతుర్థ గురుడి ప్రభావం వల్ల పనులు సానుకూలమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ అవసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం చాలా బాగుంటుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచన కనిపిస్తుంది. పాత అప్పులు తీరే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కాస్త సంయమనం పాటించండి. మీ రాశిలోకి కుజుడి ప్రవేశం వల్ల కాస్త ఆవేశం, తొందరపాటు పెరుగుతాయి, కాబట్టి ఓర్పు అవసరం. అయితే తృతీయ గురుడి సంచారం వల్ల చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. బంధువుల మద్దతు లభిస్తుంది. గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహ నిశ్చయానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి తరపు నుంచి మంచి సహకారం అందుతుంది.

మిథున రాశి

మీ రాశిలోనే గ్రహాల సంచారం జరగడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిథున రాశిలో సూర్య సంచారం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

కర్కాటక రాశి

ఈ సమయంలో మీరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో అధికారులతో వాదనలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరగవచ్చు. ధన నష్టం జరగకుండా అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. కానీ వారం చివర్లో మీ జన్మరాశిలోనే గురు, బుధ, శుక్రుల సంచారం వల్ల మీకు అద్భుతమైన "రాజయోగం" రాబోతుంది. ఆదాయం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా కంటి సమస్యలు లేదా అలసట రావచ్చు. వివాహ యోగం అత్యంత బలంగా ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన సంబంధాలు ఈ కాలంలో కుదిరే ఛాన్స్ ఉంది.

సింహ రాశి

గ్రహాల అనుకూలత వల్ల ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాభాలు బాగుంటాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. అయితే లాభ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆదాయ మార్గాలు బాగుంటాయి. అయితే 12వ ఇంట గురుడి సంచారం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు, శుభకార్యాల నిమిత్తం ఖర్చులు అధికంగా ఉంటాయి. సంబంధాలు వస్తాయి కానీ మాట ముచ్చట్లు ఒక కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. నిదానంగా వ్యవహరించడం మేలు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి

ఈ రాశి వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి కనిపిస్తోంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

తుల రాశి

భాగ్య స్థానంలో గ్రహాల సంచారం వల్ల అదృష్టం మీ వరిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక లేదా పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఖర్చులు చేస్తారు. తండ్రితో సృజనాత్మక సంబంధాలు బలపడతాయి. సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఈ వారం మీరు కొంచెం ఓపికగా ఉండటం మంచిది. పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో పూర్తి చేస్తారు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న విషయాలకు దూరంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చాలా కాలంగా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు అందుతాయి. నిశ్చితార్థానికి సమయం అనుకూలంగా చెప్పవచ్చు.

ధనస్సు రాశి

ఈ వారం వీరికి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టమ స్థానంలో గ్రహాల సంచారం వల్ల పనుల్లో స్వల్ప అడ్డంకులు ఎదురు కావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అయితే ఆరవ ఇంట సూర్యుడి ప్రభావంతో శత్రువులపై విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. సంబంధాలు మాట్లాడేటప్పుడు తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వైవాహిక జీవితం ఎంతో మధురంగా ఉంటుంది.

మకర రాశి

శత్రువులపై విజయం సాధించే కాలం ఇది. మీపై వచ్చే విమర్శలను తిప్పి కొడతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు, ఉద్యోగార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కోర్టు కేసులు లేదా వివాదాలు మీకు అనుకూలంగా మారి ఆర్థిక లాభం చేకూరుతుంది. వారం ప్రారంభంలో కాస్త భారంగా అనిపించినా, క్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు అందుతాయి. పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సప్తమ స్థానంలో ఉచ్ఛ గురుడి వీక్షణం వల్ల వివాహ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

కుంభ రాశి

పంచమ సూర్యుడు, ఆరో ఇంట గురుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. సృజనాత్మకత, మేధస్సు పెరుగుతాయి. మీ ఆలోచనలు, కొత్త ఐడియాలు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటాయి. పిల్లల చదువుల కోసం లేదా శుభకార్యాల కోసం ఖర్చులు ఉంటాయి. సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

మీన రాశి

సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగంలో స్థానచలనం లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంది, ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది. ఇల్లు లేదా ఆస్తుల కొనుగోలుకు అనుకూలమైన సమయం. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే, మానసిక ఆందోళనలు తగ్గించుకోవడానికి ప్రశాంతంగా ఉండటం మంచిది.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు.

Next Story