- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGTET-2026 ప్రాథమిక ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు ఫిబ్రవరి 1 వరకు గడువు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2026కి సంబంధించిన ప్రాథమిక కీ (Initial Key) ఇవాళ విడుదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2026కి సంబంధించిన ప్రాథమిక కీ (Initial Key) ఇవాళ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ చైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అభ్యర్థులు తమ ‘కీ’ని https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక ‘కీ’పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అభ్యంతరాలను సమర్పించడానికి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించారు. అభ్యర్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా మాత్రమే తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Next Story






