- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నుమాయిష్ -2026లో టీజీపీసీబీ స్టాల్ కు బెస్ట్ అవార్డు
by Muthe.Rajitha |
కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు నుమాయిష్ -2026లో టీజీపీసీబీ స్టాల్ కు బెస్ట్ అవార్డు లభించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వెలువడుతున్న కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అందుకు కారణాలు, పీసీబీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నిర్వహించినందుకు నుమయిష్ లో టీజీపీసీబీ స్టాల్ కు బెస్ట్ అవార్డు దక్కింది. స్టాల్ లో మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. స్టాల్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చినందుకునుగాను బెస్ట్ అవార్డు వచ్చిందని పీసీబీ అధికారులు తెలిపారు.
Next Story






