రేపు టీజీఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల

by Muthe.Rajitha |

ఈ నెల 19 నుండి టీజీఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని కన్వీనర్ పేర్కొన్నారు.

రేపు టీజీఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపు టీజీఈఏపీసెట్ 2026 షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు టీజీ ఎప్ సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్ సెట్ ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19 న 11.30 నుండి ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://eapcet.tgche.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు. ఎప్ సెట్ పరీక్షలు మే 4 నుండి 11 వరకు జరగనున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 5 నుండి 8 వరకు విరామం ఉంటుంది. మే 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. రెండు రోజుల్లో మూడు సెషన్ల పాటు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ఉంటాయి. మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ పరీక్షలను మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

Next Story