TG Municipal Elections: సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల షెడ్యూల్ విడుదల

by Gantepaka Srikanth |

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో ప్రచార సభలను నిర్వహించనున్నారు.

TG Municipal Elections: సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో ప్రచార సభలను నిర్వహించనున్నారు. ఈనెల 4న నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ జిల్లాలోని రూరల్‌లో, 7న రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో, 8న భూపాలపల్లిలో, 9న మెదక్‌లో ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. కాగా, 2న హైదరాబాద్‌లో తెలంగాణ అమరవీరుల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు. మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదులకు ఎస్‌ఈసీ టీఈ పోల్‌ మొబైల్‌ యాప్‌ ఏర్పాటు చేసింది. tsec.gov.in ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Next Story