TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌కు ముగిసిన గడువు

by Gantepaka Srikanth |

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రకియ ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు.

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్‌కు ముగిసిన గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రకియ ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో దాఖలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు(Telangana municipal corporations), 414 డివిజన్లు, 116 మున్సిపాల్టీలు(Telangana municipalities) 2,582 వార్డుల్లో ఫిబ్రవరి 11న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Next Story