ఐఎస్ సదన్‌లోని సంగం లక్ష్మీబాయి కళాశాల వద్ద ఉద్రిక్తత

by Jakkula.Mamatha |

స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సంగం లక్ష్మీబాయి జయంతి వేడుకల నిర్వహణ సందర్భంగా ఐఎస్ సదన్‌లోని సంగం లక్ష్మీబాయి కళాశాల వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఐఎస్ సదన్‌లోని సంగం లక్ష్మీబాయి కళాశాల వద్ద ఉద్రిక్తత
X

దిశ, చంపాపేట్: స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు సంగం లక్ష్మీబాయి జయంతి వేడుకల నిర్వహణ సందర్భంగా ఐఎస్ సదన్‌లోని సంగం లక్ష్మీబాయి కళాశాల వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జయంతి వేడుకలు నిర్వహించేందుకు వచ్చిన నిర్వాహకులకు కళాశాల యాజమాన్యం అడ్డంకులు కల్పించిందని నిర్వాహకులు ఆరోపించడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈసారి కూడా కళాశాల ప్రాంగణంలో సంగం లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే కళాశాల యాజమాన్యం కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతో పాటు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు.

ఈ క్రమంలో నిర్వాహకులు, కళాశాల ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. జయంతి వేడుకలను అడ్డుకోవడం తగదని, సంగం లక్ష్మీబాయి సేవలను గుర్తు చేసుకునే కార్యక్రమాలను గౌరవించాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. మరోవైపు, కళాశాల యాజమాన్యం తమ నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, అవసరమైన అనుమతుల అంశంలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఘటనకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు వెలువడిన నేపథ్యంలో, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Next Story