- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంటిని భారీగా పోలీసులు చుట్టు ముట్టడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న రోహిత్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడం సంచలనం రేపింది. తాండూర్, వికారాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, హైదరాబాద్, రాంగారెడ్డి జిల్లా పోలీసు బృందాలు కలిపి సుమారు 50 మంది సిబ్బందితో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. పోలీసులు రోహిత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలతోపాటు, ఆయన ఇంటికి వచ్చే అనుచరులను ప్రశ్నిస్తూ లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, రోహిత్ రెడ్డి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు సిబ్బందిని రప్పించారని తెలుస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. అయితే ఇటీవల జరిగిన తాండూరు మునిసిపల్ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది, పొలిసు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదైంది. ఈ కేసులో రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు అనే వార్త బయటికి రావడంతో రోహిత్ అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఒకానొక దశలో పోలీసులకు, రోహిత్ అనుచరులకు మధ్య తోపులాట జరగడంతో కాసపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






