- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి RBI వద్ద తెలుగు రాష్ట్రాల భారీ అప్పులు
ఆర్బీఐ వద్ద తెలంగాణ రూ. 2000 కోట్లు, ఏపీ రూ.4,600 కోట్లు ఈ వేలం ద్వారా రుణాన్ని సేకరించాయి.

దిశ, వెబ్ డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా నిర్వహించిన స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ (SDL) వేలంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. రెండు రాష్ట్రాలు కలిపి ఈ వేలం ద్వారా మొత్తం రూ. 6,600 కోట్ల మేర రుణాలు పొందాయి. ఈ నిధులను ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పాత రుణాల చెల్లింపులు, అలాగే ఇతర అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
ఈ వేలంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా నిధులను దక్కించుకుంది. ఏపీ ప్రభుత్వం మూడు టెన్యూర్స్ కు గాను మొత్తం రూ.4,600 కోట్లను సేకరించింది. ఇందులో 8 సంవత్సరాల గడువు గల రుణాలపై సుమారు 7.81 శాతం వడ్డీ రేటు నిర్ణయించబడగా, 16 సంవత్సరాలు, 30 సంవత్సరాల దీర్ఘకాలిక రుణాలపై సుమారు 7.91 శాతం వడ్డీ రేటు ఖరారైంది.
మరోవైపు తెలంగాణ కూడా ఈ వేలం ద్వారా ₹2,000 కోట్ల నిధులను సమకూర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం 2033, 2037, 2047 సంవత్సరాల గడువుతో అంటే సుమారు 7 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల కాలపరిమితితో ఈ రుణాలను తీసుకుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ సేకరించిన ఈ బాండ్లపై వడ్డీ రేట్లు 7.75 శాతం నుండి 7.92 శాతం వరకు నమోదయ్యాయి.






