తెలంగాణా వ్యవసాయం.. 2047 పుస్తకం విడుదల

by Batti.Sumithra |

రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ పై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణా వ్యవసాయం.. 2047 పుస్తకం విడుదల
X

దిశ, రాజేంద్రనగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ పై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీయూ) ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పీజేటీయూ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వ్యవసాయ రంగ అంతర్జాతీయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన ‘తెలంగాణా వ్యవసాయం–2047 సవాళ్లు, విధాన మార్గదర్శకాలు’ అనే నివేదికను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా, ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య రచించిన ‘ఇందిరాగాంధీ.. హరిత విప్లవ రూపశిల్పి’ పుస్తకాన్ని కూడా ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్దాస్ జానయ్యను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఉపకులపతి ప్రత్యేక ధన్యవాదాలు..

ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న సుమారు 550 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఉపకులపతి తెలిపారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను వెంటనే ఆమోదించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాత పరీక్ష ఆధారంగా, ఎలాంటి మౌఖిక పరీక్షలు నిర్వహించకుండా పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపడతామని ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

Next Story