ఎఫ్ఐఏసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా ఆరు అవార్డులు అందుకున్న తెలుగు సినిమా (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-01 15:29:04  IST  )

నేచురల్ స్టార్ నాని(Nani), శౌర్యువ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘హాయ్ నాన్న’.

ఎఫ్ఐఏసీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా ఆరు అవార్డులు అందుకున్న తెలుగు సినిమా (పోస్ట్)
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(Nani), శౌర్యువ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు పలు అవార్డులు కూడా సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘హాయ్ నాన్న’(Hi Nanna) మూవీ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది.

ఎఫ్ఐఏసీ ఫిల్మ్ ఫెస్టివల్‌(IFAC Film Festival)లో ఏకంగా ఆరు అవార్డులు అందుకుంది. బెస్ట్ ఫీచర్స్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్(Best Director) , బెస్ట్ సెట్ డిజైన్, హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ‘ది ఒనిరోస్’(The Oneiros) ఫిల్మ్ ఫెస్టివల్‌లో 11 అవార్డులు వచ్చాయి.


Click Here For Twitter Post..

Read More...

Robinhood: నితిన్ ‘రాబిన్ హుడ్‌’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..!

Next Story