- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఐదు రకాల సరుకులు ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్‌బియ్యం లబ్దిదారులకు సన్నబియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్లాన్చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రేషన్‌బియ్యం లబ్దిదారులకు సన్నబియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్లాన్చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్స్పష్టం చేశారు. పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్దంగా ఉందని, సన్నబియ్యం అందజేయడంతో రాజీ పడకుండా లబ్దిదారులకు పంపిణీ చేస్తామన్నారు. గురువారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 25 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు వానాకాలంలో 70.82 లక్షల మెట్రిక్‌టన్నులు సేకరణ జరగడంతో మరో రికార్డు సాధించామన్నారు. గతంలో కోనుగోలు చెసిన 70.20 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డ్ ను ఈ ఖరీఫ్ సీజన్ అధిగమించిందన్నారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పర్వదినం జరుపుకుంటున్న తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి,రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా నీటిపారుదల శాఖాలు సమన్వయం చేయడంతో పాటు తెలంగాణా రైతాంగం భాగస్వామ్యం ఈ రికార్డులో భాగస్వామ్యం ఉందన్నారు.
రైతుల కృషి అభినందినీయం
ధాన్యం దిగుబడిలో రైతుల కృషిని అభినందించిన ఆయన వ్యవసాయ రంగంపట్ల సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో 20 రకాలపైగా సన్నవరి రకాలు ఉన్నాయని వాటిలో సాంబా మసూరి, తెలంగాణ మసూరి బాగా డిమాండ్ఉందన్నారు. ఇకా నుంచి రైతులు పంట సాగు చేసే సమయంలో మేలు జాతి వరి విత్తనాలు అందజేస్తామని తెలిపారు. ధాన్యం నిల్వలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాముల్లో 29 లక్షల మెట్రిక్‌టన్నుల సామర్ధ్య ఉందని, అవి కూడా పాత టెక్నాలజీలో నిర్వహణ జరుగుతుందని ఇంకా నుంచి నూతన టెక్నాలజీ విధానం తీసుకొచ్చి ధాన్యం నిల్వ సామర్ధం పెంచేందుకు చర్యలు చేపడుతామన్నారు.
నూతన విధానాలు తీసుకొస్తున్నాం
కొత్తగా గోదాములను కేంద్రం సహాయంతో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. వచ్చే యాసంగి సీజన్‌లో డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం కేటాయింపు చేయమని, జిల్లా అధికారులు రాష్ట్ర అధికారుల నిబంధనలకు లోబడి నిర్ణయాలు అమలు చేయాలని సూచించారు. అదనపు ఉత్పత్తిని పెట్టుబడిగా పెట్టే ప్రయత్నంలో, ఎగుమతి ఆధారిత బియ్యం మిల్లులను ప్రోత్సహించడానికి నూతన విధానాలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం, దేశం వెలుపల బియ్యాన్ని ఎగుమతి చేసే మిల్లులకు ప్రోత్సాహకాలను రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో మిల్లింగ్ పరిశ్రమ ప్రధాన ఆర్థిక వనరుగా మారిందన్నారు. మంచిగా పనిచేసే మిల్లులు కొత్త మార్కెట్లను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వ మద్దతు అందిస్తుందన్నారు. ఖరీప్‌సీజన్‌లో 14.21 లక్షల మంది రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో రూ. 17,018 కోట్ల జమ చేశామని, అదే విధంగా సన్నాల బోనస్రూ. 1425 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
మొదటిస్థానంలో నిజామాబాద్...
ధాన్యం సేకరణలో నిజామాబాద్మొదటిస్దానంలో ఉండగా, సెకండ్స్థానం నల్లగొండ, మూడో స్ధానం కామారెడ్డి, తరువాత జగిత్యాల, మెదక్జిల్లాలు ఉన్నట్లు వెల్లడించారు. వానాకాలం సీజన్‌లో 66.80 లక్షల ఎకరాలు సాగు చేయగా, 148.30 లక్షల మెట్రిక్‌టన్నులు ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. రాష్ట్రంలో సన్నాలను పండించేందుకు ముందెన్నడూ లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ ను సన్నాలు పండించిన రైతాంగాం ఖాతాలో జమ చేశామని ఇప్పటి వరకు 1,425 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కావడంతో కొనుగోలు ప్రక్రియ కూడా ప్రభుత్వం ఒక సవాల్ గా స్వీకరించి 8,448 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు.






